బొగ్గు ఉత్పత్తి కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..

బొగ్గు ఉత్పత్తి కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..

- కలెక్టర్ ను కలిసి విన్నవించిన సింగరేణి అధికారులు..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  బొగ్గు ఉత్పత్తి కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ సింగరేణి అధికారులు మంగళవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిశారు. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం, ఆపరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావు తదితరులు జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్యను వివరించారు. భూపాలపల్లి కాకతీయఖనిలో ఓసి-2, ఓసి-3 ఉపరితల గనుల కోసం భూసేకరణ చేయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయితేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు చాలావరకు భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని, ఇంకా మిగిలిన భూసేకరణను తొందరలోనే పూర్తిచేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.