హరితహారం నాటిన ప్రతి మొక్క బ్రతకాలి - జిల్లా అదరపు కలెక్టర్

హరితహారం నాటిన ప్రతి మొక్క బ్రతకాలి - జిల్లా అదరపు కలెక్టర్

మహాదేవపూర్, ముద్ర: హరితహారం క్రింద గ్రామాలలో నాటిన మొక్కలు పూర్తిగా బ్రతికేలా చర్యలు తీసుకోవాలనిఅదనపు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని అన్నారం గ్రామపంచాయతీలో హరితహారం కార్యక్రమం కింద నాటిన హరితవనాలను పరిశీలించారు. హరితవనాల కోసం ఏర్పాటు చేసిన పని ప్రదేశంలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలను సంరక్షించే పనిని  గ్రామపంచాయతీ చేపట్టాలని, వర్షాలు తగ్గిన వెంటనే మొక్కలు చనిపోకుందా ట్యాంకర్ల ద్వారా  నీరు పట్టించాలన్నారు. ఈ పని కోసం ప్రత్యేకంగా వాచర్లను కూడా నియమించుకుని నాటిన ప్రతి మొక్క బ్రతికేలా గ్రామపంచాయతీ చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వానికి బాధ్యత వహించాల్సిందిగా కోరారు. హరితహారం నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు ఎంపీడీవో రవీందర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ రవీంద్రనాథ్, మండలపంచాయతీ అధికారి ప్రసాద్, ఉపాధి హామీ ఎపిఓ రమేష్, అసిస్టెంట్ ఇంజనీర్ రవీందర్, టెక్నికల్ అసిస్టెంట్ మధుకర్, ఫీల్డ్ అసిస్టెంట్ వనిత, మేట్లు తదితరులు పాల్గొన్నారు.