అర్హులైన జర్నలిస్టులకే ఇంటి స్థలాలు కేటాయించాలి..

అర్హులైన జర్నలిస్టులకే ఇంటి స్థలాలు కేటాయించాలి..
  • జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:అర్హులైన జర్నలిస్టులకే ఇంటి స్థలాలు కేటాయించాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ అడ్ హక్ కమిటీ, జర్నలిస్టు యూనియన్ సంఘాలు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానించాయి.భూపాలపల్లి జిల్లా ఆవిర్భావం నుండి పనిచేస్తూ ఐదు సంవత్సరాల కాలంలో రెండు అక్రిడేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకే ఇంటి స్థలాలు కేటాయించాలని కాకతీయ ప్రెస్ క్లబ్ అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్ లో అడ్ హాక్ కమిటీ కన్వీనర్ నాగపురి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో (టీయూడబ్ల్యూజే) ఐజేయు, టీజేఏ, ఎస్ సి, ఎస్టి, బిసి జర్నలిస్టు, టీపిజేఏ , ఆధ్వర్యంలో సంయుక్తంగా సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల ముఖ్య నేతలతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాల సూచనతో  రెండు అక్రిడిటేషన్ లు కలిగిన జర్నలిస్టులను పరిగణలోకి తీసుకొని జాబితాను తయారు చేయడం జరిగిందని ఈ జాబితాను పరిశీలించిన సభ్యులు ఏక గ్రీవ అంగీకరిస్తూ తీర్మాణం చేయడం జరిగిందన్నారు జిల్లా కేంద్రంలో ఇంకా ఎవరైనా అర్హత గల జర్నలిస్టులు ఉన్నట్లు మీ దృష్టికి వస్తే వారినీ గుర్తించి వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఒకవేళ అనర్హత కలిగిన జర్నలిస్టులు ఉంటే దానికి మా నుండి అభ్యంతరాలు తెలపడం జరుగుతుందని అందరూ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో టియుడబ్లు జె (ఐజేయు)జిల్లా ప్రధాన కార్యదర్శి  సామంతుల శ్యామ్,ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సామల శ్రీనివాస్,టీజేఏ జిల్లా అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి, జల్ది రమేష్, బెల్లం తిరుపతి, పావుశెట్టి శ్రీనివాస్,  తడుక సుధాకర్, ఐజేయు దాడుల కమిటీ జిల్లా కన్వీనర్ కారెంగుల శ్రీను,ఎస్ సి ఎస్ టి జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బండ మోహన్,ఐజేయు తెంజు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కొంకుల సాంబయ్య,సీనియర్ జర్నలిస్టులు రచర్ల ప్రభాకర్, సమ్మయ్య గౌడ్ ఆడహాక్ కమిటీ కో కన్వీనర్ ఆరెల్లి నరేందర్, సల్పాల తిరుపతి, బండారి రాజు, రజినీకాంత్, రాచర్ల ప్రభాకర్, జాలిగపు రాజు, సుమన్, యాంసాని రాజు, బొట్ల రాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.