ఏజెన్సీ లో సింజెంటా బాండ్ మొక్కజొన్న భారీ స్కాం

ఏజెన్సీ లో సింజెంటా బాండ్ మొక్కజొన్న భారీ స్కాం
  • రైతుల  పేర్లతో దొంగ సంతకాలు చేయడం
  • నష్ట పరిహారం కాజేయడం
  • ఏజెన్సీ లో సింజెంట బాండ్ మొక్కజొన్న ను నిషేధించాలి
  • విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ జరపాలి

ముద్ర, వెంకటాపురం ( నూ): ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలం లోని గిరిజన గ్రామాలలో సింజెంట బాండ్ మొక్కజొన్న కంపెనీ రైతులను మోసం చేస్తు భారీ స్కాం కు పాల్పడుతోంది. గత మూడు సంవత్సరాలుగా బాండ్ మొక్కజొన్న పంట వెస్తున రైతులకు సరైన దిగుబడి రాక నష్ట పోతుంటే , వారికీ నష్ట పరిహారం చెల్లించకుండ ఆర్గానేజర్లు, కంపెనీ ప్రతినిధులు (భద్రాచలం ఏరియా)నష్ట పరిహారంవాటాలు వేసుకొని పంచుకు తింటున్నారు. రైతులకు అప్పు లు,వారి కి కార్లు,బంగళాలు .రైతుల పేర్లతో దొంగ సంతకాలు చేసి  ,వారికి రావలసిన నష్ట పరిహారం ,ఉచిత మందులను కాజేస్తున్నరు.రైతు లకు మాయ మాటలు చెప్పి వారి కష్టని దోచుకు తింటున్నారు.ఆర్గనైజర్_ , కంపెనీ ప్రతినిధులు బయో మందులను రైతులకు బలవంతంగా అంట్టగట్టి ,వాటితో క్యాష్ చేసుకుంటున్నారు. రైతులు కేసులు పెడితే వారికి ఉన్న రాజకీయ పలుకుబడితో ఆ కేసులు నామమాత్రంగానే మిగిలి పోతున్నాయి.కంపెనీ రైతులకు ఇచ్చే రేటు కు , ఇక్కడి ఆర్గనేజరు, కంపెనీ ప్రతినిధులు చెప్పే రేటు టన్ను కి వచ్చి నాలుగు, ఐదు వేల రూపాయలు తేడా వుంటుంది.రైతు లకు వచ్చే  మూడు వేల ఐదు వందల రూపాయల ఫ్రీ మందుల్లో రైతులకు పదిహేను వందల రూపాయల మందులు ఇచ్చి మిగతా డబ్బులు ఆర్గనేజరు, కంపెనీ ప్రతినిధులు కాజెస్తున్నరు .ఇలా ప్రతి ఏటా కోట్ల లో స్కాం, అదే పంట దిగుబడి రాకపోతే ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.నష్ట పరిహారం రైతుల ఏకౌంటు లో పడకుండా, తపుడు లెక్కలు పంపి ,ఆ డబ్బు ఆర్గనేజర్ ఎకౌంటు లో పడేటట్లు రైతుల పేర్లతో దొంగ సంతకాలు చేసి , వాటిని ఆందరు కలిసి పంచుకు తింటున్నారు.ఆరుకాలం కష్ట పడి పంట చేతికి అందిన తరువాత మళ్లీ కాతలల్లో మోసాలు . ఏజె న్సీలో సింజేంట బాండ్ మొక్కజొన్న జరిపే మోసాలపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి , విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి రైతులకు తగ్గు న్యాయం చేయాలని రెండు మండల లా అమాయక గిరిజన రైతులు  కోరుతున్నారు.

అట్టం .కమలాకర్, తండ్రి.నాగేశ్వరరావు,చేకుపల్లి గ్రామం,వాజేడు మండలం.
గత సంవత్సరం నేను నాలుగు ఏకరాల సెంజెంట బాండ్ మొక్కజొన్న వేస్తే నాలుగు టన్నుల దిగుబడి వచ్చింది.  మొదట్లో ఆర్గనేజర్ ఏకరానికి మూడు,నాలుగు టన్నుల దిగుబడి వస్తుంది అని చెప్పారు.అలా రాని పక్షంలో నష్ట పరిహారం చెల్లిస్తామని నమ్మబలికి ఎప్పుడేమి లేదు అని బెదిరిస్తున్నా డు.ఏకరనికి మూడువేల ఐదు వందల రూపాయల ఫ్రీ మందులు ఉంటే మాకు వేయి రూపాయల ఫ్రీ మందులు ఇచ్చాడు. ఇలా మండలం లో వంద ఏకరాలలో మొక్కజొన్న వేస్తే ఎవరికి టన్ను పై దిగుబడి రాలేదు.కలెక్టర్ తగ్గు విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని పత్రిక ముఖం గా కోరుకుంటున్నాం.

చెరుకూరి.మల్లిఖార్జున్ తండ్రి.రామ్మూర్తి.మొరుమురు గ్రామం, వాజేడు మండలం.ఏకరని కి ఆరువందలనాలబై కిలోల దిగుబడి వచ్చింది.మందుల బిల్లు ముపైమూడు వేల రూపాయలు వేశారు.ఫ్రీ మందులు ఇవ్వకుండ మా పేర్లతో దొంగ సంతకాలు చేసి డబ్బులు కాజేసారు.

పొట్టం .బాబురావు,తండ్రి.బతకయ్య
చిరుత పల్లి గ్రామం. వెంకటాపురం మండలం.
నేను నాలుగు ఏకరాలలో సేంజెంట మొక్కజొన్న వేస్తే నాలుగు టన్నుల దిగుబడి వచ్చింది.ఆర్గనేజరు ఇ ష్టం వచ్చినట్లు బయో మందులు యిచ్చి ఏకరానికి నలభై వేల రూపాయలు ఖర్చు చేశాడు.

శ్యామల.గోపీనాథ్ తండ్రి కన్నయ్య.ఒంటిమామిడి ,వెంకటాపురం మండలం.నేను 2020-2021 సంవత్సరం లో మూడు ఏకరలలో సింజేంట మొక్కజొన్న వేసి నష్టపోయాను. కంపెనీ నష్టపరిహారం ఇ స్తే ఆర్గానేజరు, కంపెనీ ప్రతినిధులు కలిసి మా పేర్లతో దొంగ సంతకాలు చేసి డబ్బులు తినారు.