అంకుషాపూర్ గ్రామ వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గండ్ర సత్యనారాయణ రావు

అంకుషాపూర్ గ్రామ వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గండ్ర సత్యనారాయణ రావు

 ముద్ర, మొగుళ్లపల్లి :ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.2 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని టీపీసీసీ మెంబర్..భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మొగుళ్ళపల్లి మండలంలోని అంకుషాపూర్ గ్రామ వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల కిట్టును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొగుళ్ళపల్లి మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. అనంతరం వరద ముంపుతో సర్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

అదేవిధంగా వరదలతో నష్టపోయిన ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. వరదలతో సర్వం కోల్పోయిన గ్రామ ప్రజలకు సింగరేణి, జెన్కో సేవ్ నిధులు, విపత్తు నిధులతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి జీఎస్సార్ సూచన చేశారు. గ్రామస్తులకు తక్షణ సాయం కింద వెంటనే ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదలతో దెబ్బతిన్న పంట పొలాల రైతులకు ఒక్కో ఎకరానికి రూ.2 లక్షల సాయం ప్రకటించి, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, సీనియర్ నాయకులు పడిదల ప్రకాష్ రావు, తక్కళ్ళపల్లి రాజు, నీరటి మహేందర్, పులి శ్రీనివాస్ రెడ్డి, అంకుషాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కౌడగాని హేమంత్ రావు, నాయకులు కౌడగాని శ్రీకాంత్, రామగిరి వంశీ, క్యాతరజు లింగమూర్తి, జీడి రఘుపతి, జీడి సంపత్ తదితరులున్నారు.