మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు 

మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు 
  • కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
  • మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేపిఆర్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా శనివారం రోజున సర్వమత ప్రార్థనలు చేశారు. సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గము, భారత రాష్ట్ర సమితి నేతలు, హరీష్ రావు అభిమానులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ సంఘాల నాయకులు సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల హరీష్ రావు జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేశారు. మంత్రి హరీష్ రావుకు మెదక్ ఎంపీ భారత రాష్ట్ర సమితి సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాదులోని ఆయన స్వగృహంలో కలిసి బోకేను అందజేశారు.

సిద్దిపేటలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు, కౌన్సిలర్లు, పట్టణ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు నిమ్మ రజనీకాంత్ రెడ్డి, విద్యార్థి విభాగాలు, మహిళా విభాగము ఆధ్వర్యంలో సిద్దిపేటలోని మోహినిపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మొదట హరీష్ రావు పేరిట ప్రత్యేక పూజలు చేయించారు.ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి సభ్యులు బారాస నాయకులకు ఆలయ మర్యాదలతో సత్కారం చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు జన్మదిన కేకును చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు పట్టణ కౌన్సిలర్ల నేతృత్వంలో స్థానిక చర్చిలో ప్రార్థనలు చేశారు.హరీష్ రావు నిండు నూరేళ్లు జీవించాలని చర్చి పాస్టర్ మరికొందరు దైవజనులు ఈ సందర్భంగా జీసస్ ను వేడుకున్నారు. అనంతరము చర్చిలో హరీష్ రావు జన్మదిన కేకును కట్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్, కాటం రఘురాం ,సాయి ఈశ్వర్ గౌడ్,లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఈద్గా వద్ద ఉన్న జానుల్లాసా దర్గాలో మంత్రి హరీష్ రావు పేరిట ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అనంతరము కేక్ కట్ చేసి ముస్లింలకు పంపిణీ చేశారు. మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు జీవించాలని ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు  అల్లాను ప్రార్థించారు.

మంత్రి క్యాంప్ కార్యాలయంలోనూ భారత రాష్ట్ర సమితి శ్రేణులు  కేకును కట్ చేసి హరీష్ రావు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. మరోవైపు అటు గజ్వేల్ ఇటు దుబ్బాకలో మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.