రెడ్డి కార్పొరేషన్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా

రెడ్డి కార్పొరేషన్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా
  •  మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ
  • రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి విగ్రహావిష్కరణ

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు విషయమై ముఖ్యమంత్రిని కలుస్తానని, గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతానని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి  హామీ ఇచ్చారు. మండల కేంద్రమైన దుబ్బాకలో మండల రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజా బహదూర్ వెంకట రామారెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం  కె.ఆర్ ఆర్ గార్డెన్లో జరిగిన రెడ్డిల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపీ మాట్లాడారు.

అగ్రవర్ణ పేదల ఐక్యవేదిక జాతీయ నాయకుడు అమ్మన రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ తో పాటు రాష్ట్ర రెడ్డి జేఏసీ అధ్యక్షుడు అప్పమ్మ గారి రామిరెడ్డి, వివిధ రెడ్డి సంఘాల నేతలు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, పాతూరి వెంకట్ రెడ్డి,ఏనుగు సంతోష్ రెడ్డి పద్దూరి వెంకటేశ్వర రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి మద్దుల గాల్ రెడ్డి, కె, శ్రీనివాస్ రెడ్డి, ఎల్ రామ్ రెడ్డి, లక్ష్మారెడ్డి రెడ్డి రాధికా రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గన్య వనిత భూమిరెడ్డి మండల నేతలు కే వెంకట్ సింహారెడ్డి, జీవన్ రెడ్డి రెడ్డి కౌన్సిలర్లు రెడ్డి సర్పంచులు రెడ్డి ఎంపీటీసీలు గ్రామ శాఖ రెడ్డి సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని సభలో పాల్గొన్న నేతలంతా ప్రభుత్వాన్ని కోరారు కోరగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో తన వంతు కృషి తప్పకుండా చేస్తానని సీఎంతో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.