మంత్రి జూపల్లికి శుభాకాంక్షలు తెలిపిన వీపనగండ్ల మండల కాంగ్రెస్ నాయకులు

మంత్రి జూపల్లికి శుభాకాంక్షలు తెలిపిన వీపనగండ్ల మండల కాంగ్రెస్ నాయకులు

ముద్ర.వీపనగండ్ల:-రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు భారీ మెజార్టీతో గెలిచి పౌరసరఫరాల శాఖ మంత్రిగా మంత్రి పదవిని చేపట్టడంతో వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాదులో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, వాల మదన్ మోహన్ రావు, పానగల్ సింగల్ విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి, వీపనగండ్ల మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, నాయకులు జగదీశ్వర్ రెడ్డి లు మంత్రి జూపల్లి కృష్ణారావుకు శాలువా కప్పి శుభాకాంక్షలు అందజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వారు ఆశాభవం వ్యక్తం చేశారు.