ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకం..

ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకం..
  • నిరశాలో నిరుద్యోగ యువకులు 
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకమని, రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం రాయికల్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇద్దం సుధీర్ రెడ్డి, రాయికల్ పట్టణ అధ్యక్షుడిగా బత్తీని నాగరాజును జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు నియమించగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీలో అయినా యువకుల పాత్ర కీలకం రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు యువకులు కృషి చేయాలని కోరారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, విద్య, ఉద్యోగాలకు సంబంధించి కె జీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య హామీ అమలు కావడం లేదన్నారు. ఉద్యోగాల భర్తీ పై నిరుద్యోగ యువకులు నిరాశలో ఉన్నారని, తెలంగాణలోని నిరుద్యోగ యువతను మభ్య పెట్టేందుకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చి, నాలుగున్నరేళ్లు  గడిచినా ఆ ఉసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కొయ్యాడ మహిపాల్ రెడ్డి, రాకేష్ నాయక్, బాపురపు రాజు, గుజ్జుల కిరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, వేణు రావు పాల్గొన్నారు.