భారీ కాంస్య శివాజీ విగ్రహం ఆవిష్కరణ

భారీ కాంస్య శివాజీ విగ్రహం ఆవిష్కరణ
A huge bronze statue of Shivaji is unveiled

హాజరైన కమలానంద భారతి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణం నడిబొడ్డున భారీ కాంస్య విగ్రహాన్ని మంగళవారం రాత్రి శ్రీ చిదానంద ఆశ్రమం భువనేశ్వర్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి, గోషామహల్, మెదక్ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అశేష జనవాహిని తరలిరాగా.. చత్రపతి శివాజీ జయ జయ ద్వానాల మధ్య విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. విగ్రహ కమిటీ అధ్యక్షులు మాయ శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, నాయిని ప్రసాద్ చెన్నా రామచంద్రం, నరసరావుపేట ని గోల నాగభూషణం సత్యనారాయణ తో పాటు విగ్రహ దాతలు పాల్గొన్నారు.

ఆవిష్కరణ కార్యక్రమంలో వైభవంగా ఆవిష్కరించారు. కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ కలలో వచ్చిన వీరుడు శివాజీ అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ విద్యా విధానంలో దేశ చరిత్ర, ప్రపంచంలో పోరాటాలు తెలిసేలా పుస్తకాలు తయారవుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితిలో దేశం సుఖంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశంలో బలహీనపరిచే కుట్ర జరుగుతుందని తెలిపారు.  మారాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శివాజీగా మారాలని పిలుపునిచ్చారు. శివాజీ విగ్రహాలు ఏర్పాటుతోపాటు ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలని యువతకు సూచించారు. గోమాత సేవ చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ  స్త్రీలను గౌరవించిన ఆదర్శప్రాయుడు శివాజీ చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. శివాజీ ఓ గొప్ప ధీరుడు పరాక్రమవంతుడు అన్నారు. శివాజీ మనదేశంలో జన్మించినందుకు ప్రతి ఒక్కరము గర్వపడాలన్నారు.