మెదక్ లో మంత్రి హరీష్ కు ఏం పని

మెదక్ లో మంత్రి హరీష్ కు ఏం పని
  • మెదక్ లో మంత్రి హరీష్ కు ఏం పని
  • పోలీస్ వాహనాల్లో సూట్ కేసుల్లో డబ్బులు  పట్టుకొస్తున్నారు
  • రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
  • మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు 

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ లో మంత్రి హరీష్ కు ఏం పని, పొద్దున లేవగానే పోలీస్ వాహనాల్లో సూట్ కేసుల్లో డబ్బులు  పట్టుకొస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. శనివారం మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 
మీ శని వదిలినప్పుడే మెదక్ బాగుపడుతుందని మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు. 
10 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు మెదక్ రింగురోడ్ ఇవ్వలేదు, మీరు కాదు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం హాయంలోనే మెదక్ జిల్లా ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక   సిద్దిపేట జిల్లా సాధించుకున్నారన్నారు. 


పోచారం వద్ద ఉన్న ఫారెస్ట్ పార్కును సిద్దిపేట తరలించారన్నారు. 
మెదక్ పై మంత్రి హరీష్ రావు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. మెదక్ ను వదిలింత వరకు ఊరుకోను... తరిమి తరిమి వెంటాడుతా అని హెచ్చరించారు. 
గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడిందని ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఈరోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వెలబడలేదు, రెండుసార్లు పేపర్లు లీక్ అయ్యాయి,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 317 రద్దు చేస్తామని, 
ప్రభుత్వ ఉద్యోగులకు  25 శాతం పిఆర్సి ఇస్తామన్నారు. 
కిరణ్ కుమార్ రెడ్డి 27 శాతం పిఆర్సి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 
సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు గడపగడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై  ఉందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు బూటకమన్నారు. 
ఈ పథకాల వల్ల సిద్దిపేటకు మాత్రమే న్యాయం జరిగింది, మిగతా జిల్లాలకు జరగలేదని హన్మంత్ రావు పేర్కొన్నారు. 
నేను ఇక్కడ ఉంటే మీకు అవకాశం వచ్చేది కాదు, 
నా ఊపిరి ఉన్నంతవరకు సేవా కార్యక్రమాలు ఆపమని స్పష్టం చేశారు.  మేము చేసిన సేవా కార్యక్రమాల్లో ఒక్క శాతం చేసిన రాజకీయాలను వదులుకుంటానని సవాల్ విసిరారు. ఎంఎస్ఎస్ఓ చైర్మన్ రోహిత్ మాట్లాడుతూ...
మాకు రాజకీయ పదవులు లేకపోయినా మెదక్ లో అభివృధి కార్యక్రమాలు చేశారని  ప్రజలు చెబుతున్నారన్నారు. మెదక్ 20 ఎండ్ల అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి  వచ్చామన్నారు. డబ్బు సంచులతో నాయకులను మీరే కొంటున్నారని బిఆర్ఎస్ పై ద్వజమెత్తారు. ఏ వైన్స్ ఎంత డబ్బులు ఇచ్చారో చిట్టపద్దులు మావద్ద ఉన్నాయన్నారు. 


తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను తెలంగాణలో ప్రవేశపెట్టిందని అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
అతి తొందరలోనే మెదక్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతిమయమైన పరిపాలనకు చరమగీతం పడుతుందన్నారు.
పిడికెడంత మందికి దళిత, బిసి బందునుఇచ్చారు.
పిడికెడు మంది మీ వైపు ఉంటే పిడికిలలి ఎత్తే కార్యకర్తలు నా వైపు ఉన్నారన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మెదక్ 20 సంవత్సరాల ముందు అభివృద్ధిలో తీసుకెళ్తానన్నారు. 
సిద్దిపేటలో వెయ్యి పడగల ఆసుపత్రి ప్రారంభిస్తే మెదక్ లో వంద పడకల ఆసుపత్రినే ప్రారంభించారన్నారు. 
క్లాస్ అయినా సమయం వచ్చినప్పుడు ఊర మాస్ లాగా మారతానని రోహిత్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు రాజలింగం శేఖర్ మాజీ చైర్మన్ గూడూరి కృష్ణ, సుప్రభాతారావు, సురేందర్ గౌడ్, జీవన్ రావు,  గోదల జ్యోతి కృష్ణ, రమేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆవుల గోపాల్ రెడ్డి, లాలు, రాజిరెడ్డి, అరునార్తీ వెంకటరమణ, ఉప్పల రాజేష్, పండరి గౌడ్,  హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.