మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి- ఆర్డీఓ సాయిరాం

మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి- ఆర్డీఓ సాయిరాం

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని  ఆర్డీఓ సాయిరాం సూచించారు. మెదక్ టౌన్ లో ఒకేరోజు బక్రీద్‌, తొలి ఏకాదశి, ఆషాడ మాసం బోనాల పండుగల సందర్భంగా  పట్టణ సీఐ వెంకటేష్ అధ్యక్షతన హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సాయిరాం మాట్లాడుతూ‌.. మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. మెదక్ జిల్లా శాంతికి మారు పేరన్నారు. శాంతి కమిటీ సమావేశం సాంకేతికంగా ఏర్పాటు చేసుకునేదన్నారు. నమ్మకం, అలవాటు అనేది తన అభిరుచులపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది, దానిపాట్ల జాగ్రత్త అవసరమని సూచించారు. వ్యర్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. మెదక్ డీఎస్సీ సైదులు మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరారు. గోవధపై నిషేధం విధించారని, గోవులను అక్రమంగా రవాణా చేసినా, వధించిన చర్యలు ఉంటాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టింంచకుండా ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే 100 డయల్‌, స్థానికి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.  మున్సిపల్ కమిషనర్ జానకీ రాం సాగర్ మాట్లాడుతూ వ్యర్థల కోసం ఇంటింటికి కవర్ లు అందజేస్తామని తెలిపారు. పశువైద్యాధికారి డాక్టర్ కామాటి లక్ష్మణ్ మాట్లాడుతూ చట్టానికి లోబడి జంతువులు వదించాలని సూచించారు. అక్రమ రవాణా వల్ల వాహనాదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మామిళ్ళ ఆంజనేయులు, కిషోర్, ఆవారి శేఖర్, నాయకులు రాగి అశోక్, కొండ శ్రీనివాస్, మత పెద్దలు జావీద్ మౌలానా, ఆరీఫ్, పూల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.