ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం 

ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం 

ఉట్నూర్ లో నిరసన
ముద్ర  ఆదిలాబాద్ :-ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలకేంద్రంలోని అంబెడ్కర్  చౌరస్తాలోగురువారం న కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ భోజ్జు పటేల్ గారి ఆధ్వర్యంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మోసం చేశారనిఅన్నారు. కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూట రాజేశ్వర్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవానందం,ఎస్టీ సెల్ అధ్యక్షుడు భానోత్ జైవంత్ రావు,సర్పంచ్ మెస్రం నాగనాథ్, సీనియర్ నాయకులు బిరుదుల లాజర్,సయ్యద్ నిసార్,షేక్ హైమద్, ఉపసర్పంచ్లు భగవంతురావు, గేడం మారుతి,గంగారం,నగేష్,జుబేర్,అక్రులు పాల్గొన్నారు