అకాల వర్షం, వడగళ్లతో అపార నష్టం

అకాల వర్షం, వడగళ్లతో అపార నష్టం
  • సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల ఆకస్మికంగా పడగల వర్షం
  • చేతికి వచ్చే సమయంలో నేల పాలైన పంటలు
  • ఆందోళన చెందుతున్న రైతన్నలు 
  • ప్రభుత్వమే ఆదుకోవాలని విన్నపాలు

 సిద్దిపేట :ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల శనివారం సాయంత్రం అకాల వర్షం కురిసి వడగల్లు పడ్డాయి. దీంతో అటు వరి పంట,ఇటు గాయాలు మామిడి పండ్ల తోటలకు అపార నష్టం జరిగినట్లు తెలిసింది. అకాల వడగళ్ల వర్షానికి రైతులు అరుగాళ్ళం శ్రమించి పండించిన పంట నెల పాలైంది.సిద్దిపేట జిల్లా నారాయణ రావుపేట్ కొమురవెల్లి చేర్యాల హుస్నాబాద్ కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో కురిషిన వడగళ్ల వర్షాన్నికి వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.

ఒక్కసారిగా వర్షం రావడంతో టార్పలిన్ కవర్లు కప్పే లోపే ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోని ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యం చూస్తూ లబోదిబో మంటున్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో దాన్యమంతా తడిసిపోయింది తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.