ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే

ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పావని కంటి ఆసుపత్రి ,ఆపి,రోటరీ క్లబ్  ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్   ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో గత కొంతకాలంగా పావని కంటి ఆసుపత్రి, ఆపి, రోటరీ క్లబ్ సంయుక్త అధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నమన్నారు.  ఈ కార్యక్రమంలో డా.విజయ్, హాస్పిటల్ సిబ్బంది ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.