బీ.ఆర్.ఎస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి 

బీ.ఆర్.ఎస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి 
  •  రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ 

గోదావరిఖని, ముద్ర :రామగుండం నియోజకవర్గం లోబీ.ఆర్.ఎస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పని చేయాలని రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్,రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం లో ముస్లిం యువకులు  అజర్ తాజ్ రహమాన్ రజాక్ రజాక్  సోహైల్ ఇంతియాజ్ ఇర్ఫాన్ కలీం బీ.ఆర్.ఎస్ పార్టీ లో చేరగా వారిని మంత్రిగారు ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సిఎం కేసీఆర్‌  తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమానికి పాలనకు అకర్షితులై బీ.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నరని అన్నారు. ఈ కార్యక్రమం లో పాలకుర్తి కో ఆప్షన్ సర్వర్ హపిజ్ హసీనా తదితరులు పాల్గొన్నారు.