బండి దిష్టిబొమ్మ దగ్దం

బండి దిష్టిబొమ్మ దగ్దం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర:  పదవ తరగతి పేపర్ లీకేజిల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి విభాగం (బిఆర్ఎస్వీ) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో శివునిపల్లి ఎంపిటిసి గుర్రం రాజు,  బిఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు బొంకూరి మహేష్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మారపల్లి ప్రసాద్ బాబు, మండల యూత్ అధ్యక్షుడు గుండె మల్లేష్ , ఆకారపు అశోక్,  గుర్రం నరసింహ, సోషల్ మీడియా నాయకుడు గుండె  అనిల్, గాదె రాజు, గుర్రం చిట్టిబాబు,  గొవిందు అశోక్, మోటం ప్రభాకర్  తదితరులు పాల్గొన్నారు.