సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
  • డియస్పీ సుభాష్ చంద్ర బోస్

ముద్ర ప్రతినిధి, మెదక్:సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన‌ కలిగి ఉండాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెదక్ డి యస్ పీ సుభాష్ చంద్ర బోస్ సూచించారు. సైబర్ జాగృతి‌ దివస్ సందర్భంగా బుధవారం మెదక్  సిద్ధార్థ్ పాఠశాలలో  విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... సైబర్ నేరాగాళ్ళు, ఫోన్ కాల్స్  చేసి  ఒటీపీలు, ఏటీయం కార్డ్ నంబర్లు, పిన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాలను అడిగితే చెప్పవద్దని, సైబర్ మోసాగాళ్ళు పంపిన సందేశాల లింక్ లను తెరవద్దన్నారు. ఒకవేళ సైబర్ మోసాగాళ్ళ వలలో చిక్కుకుంటే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ సిద్ధార్థ్ కళాశాల ప్రిన్సిపాల్ మత్స్యేంద్రనాథ్, సిద్ధార్థ్ పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, అధ్యాపకులు, విద్యార్తినీ, విద్యార్థులు పాల్గొన్నారు.