కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి

కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి నియోజకవర్గం, వావిలాల గ్రామంలో మూడు రోజులపాటు జరిగే  జిల్లాస్థాయి కబడ్డీ ఆటలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ..కబడ్డీ అంటూ కూతబెట్టి, ఆట ఆడారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ కబడ్డీ ఆటలోనూ, వాలీబాల్ ఆటలోనూ, ఫుట్బాల్  ఆటలోనూ కెప్టెన్ గా ఉన్నానని, ఆటలంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఆరోగ్యంగా ఉన్నానన్సారు. మీరు ఆటలను ఆడాలని, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని వారిలో స్ఫూర్తిని కలిగించారు.చదువు ఎంత ముఖ్యమో...క్రీడలు అంతే ముఖ్యమన్నారు. అప్పట్లో వాలీబాల్ జిల్లా స్థాయి అధ్యక్షుడిగా నేను,  ప్రధాన కార్యదర్శిగా కడియం శ్రీహరి ఉన్నట్లుగా చెప్పారు.

దేవరుప్పులకు కబడ్డీ టీమ్ గా వచ్చామని, వరంగల్ జిల్లా కబడ్డీ జట్టు ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చిందని గత స్మ్రతులను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలకు కూడా ఆటలు ఆడిస్తారు.ఆ పోటీలలో అన్ని ప్రైజ్ లు నాకే వచ్చేవన్నారు. అందుకే ఆరోగ్యంగా ఉన్నానని వివరించారు.  సీఎం కేసీఆర్ తెలంగాణలో  ఆటలను ప్రోత్సహించాలని, ప్రతి ఊర్లో క్రీడల కోసం ఎకరం భూమి కేటాయించి, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్,  సర్పంచ్ శ్రీమతి గంట పద్మ - భాస్కర్ తదితరులు ఉన్నారు.