పది రోజుల్లో లెక్కలు సమర్పించాలి

పది రోజుల్లో లెక్కలు సమర్పించాలి
  • లేదంటే ఆగస్ట్ 1న ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం
  • పూర్వ అధ్యక్ష, కార్యదర్శులకు గ్రేటర్ ప్రెస్ క్లబ్, యూనియన్ నాయకుల హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ గత పాలకవర్గం సంబంధిత లావా దేవీలు పది రోజుల్లో ప్రస్తుత పాలకవర్గానికి సమర్పించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, టీయూడబ్ల్యూజే (ఐజేయు), టీ యుడబ్ల్యూజే హెచ్ 143, టీ యూడబ్ల్యూజే ఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రేటర్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన అత్యవసర సమావేశ0 నిర్వహించారు. పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు వారి హయాంలో నిర్వహించిన లావాదేవీల లెక్కలను సమర్పించేందుకు టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ లెనిన్ చొరవ తీసుకున్నారు.

సమావేశానికి వచ్చిన పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు సరైన ఆధారాలు కమిటీకి సమర్పించలేదు. స్పందించిన యూనియన్, ప్రెస్ క్లబ్ నాయకులు పది రోజుల్లో గత కార్యవర్గం ఖర్చు చేసిన మొత్తాలకు సంబంధించిన లెక్కలను ఆడిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. 591 మంది జర్నలిస్టులకు సంబంధిత నిధుల విషయంలో ఉదాసీనతను క్షమించబోమన్నారు. బిల్డింగ్ నిర్మాణ0, కిరాయి అగ్రిమెంట్లు ఆదాయాలు - వ్యయాలు, ఖర్చులు- రసీదులు బిల్లులు-ఆధారాలతో లెక్కలు అప్పగించాలని ఆదేశించారు. ఆగస్టు 1 లోపు లెక్కలు సమర్పించకపోతే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో కోశాధికారి సుధాకర్, సుభాష్, దయాసాగర్, క్లబ్ ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, ఈసీ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.