ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియా... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ  ఉద్యోగం 

ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియా... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ  ఉద్యోగం 

వరంగల్ మెడికో ప్రీతి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా ప్రీతి మృతిపై విచారణ జరిపించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆదివారం  రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. సీనియర్లు వేధిస్తున్నారంటూ కేఎంసీంలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 5 రోజులుగా మృత్యువుతో పోరాడి ప్రీతి కన్నుమూసింది. గాంధీ మార్చురీలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. హైదరాబాద్ నుంచి ప్రీతి స్వగ్రామం గర్నిగడ్డ తండాకు మృతదేహాన్ని తరలిస్తున్నారు. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు సోమవారం  జరుగనున్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని గర్నిగడ్డ తండాలో ప్రీతి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.