బాధితులకు నిత్యవసర సరుకుల అందజేత

బాధితులకు నిత్యవసర సరుకుల అందజేత

ముద్ర, ఎల్లారెడ్డిపేట :ఇండ్లు కూలిపోయిన బాధితులకు నిత్యవసర సరుకులను అందజేసి ఉదారతను చాటుకున్నాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎడతెరపు లేకుండా కురిసిన వర్షానికి  ఇండ్లు కూలిపోయిన బాధితులకు నిత్యవసర వస్తువులను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ శుక్రవారం పంపిణీ చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు ముద్ధం నడిపి ఎల్లయ్య, బిపేట భూమయ్యల ఇండ్లు కూలిపోవడం జరిగింది.వారు ప్రస్తుతం సర్పంచ్ కు చెందిన ఫంక్షన్ హాల్ లో నివాసముంటున్నారు. వీరికి బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ ,పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, గంట బుచ్చగౌడ్,బీపేట రాజు  పాల్గొన్నారు.