ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు...

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు...

ముద్ర,రుద్రంగి:రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భగవాన్ విశ్వకర్మ జయంతిని ప్రత్యేక ఆరాధన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విశ్వ సృష్టికర్త, దైవ శిల్పి అయినా భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలతో భగవానుని స్మరించడం జరిగిందని మానవుని జీవమనుగడకు ఆధ్యుడైన భగవాన్ కృప ఎల్లవేళలా మానవాళిపై ఉంటుందని విశ్వకర్మను  స్మరిస్తూ ఆరాధించడం ప్రతి ఒక్కరి విధిగా భావించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మనుమయ స్వర్ణకార సంఘ అధ్యక్షులు సావనపల్లి నారాయణ, తుమ్మనపెల్లి మోహనా చారి, మండల అధ్యక్షులు కాసోజు గణేష్, కార్యవర్గ సభ్యులు టీ కరుణాకర్,ఎంఎల్ చారి,ఎలేశ్వరం శ్రీనివాస్,లింబాద్రి,కే రమేష్,గంగారం,ఈశ్వరయ్య,ఎల్  నారాయణ, రామస్వామి, అనిల్ కుమార్, భాస్కర్,కే రవి, విఠల్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.