పోగొట్టుకున్న సెల్ ఫోన్ సిఈఐఆర్ యాప్ ద్వార అందజేత

పోగొట్టుకున్న సెల్ ఫోన్ సిఈఐఆర్ యాప్ ద్వార అందజేత

నంగునూరు, ముద్ర: పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సి ఈ ఐ ఆర్ అప్ ద్వారా బాధితునికి అందజేసినట్లు రాజగోపాల్ పేట ఎస్సై రాజు గౌడ్ తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామానికి చెందిన గుండబోయిన రాజేష్ కు చెందిన మొబైల్ ఫోన్ ఉరిల్లో జరిగిన ఫంక్షన్ లో రెండు నెలల క్రిత్రం తన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. దీంతో అతను రాజగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేశాడు.

సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ యాప్ లో సెల్ ఫోన్ వివరాలు నమోదు చేసి బ్లాక్ చేశారు. సెల్ ఫోన్ వినియోగిస్తున్న అతని ఫోన్ నెంబర్ వివరాలు పోలీసులకు తెలియడంతో వెంటనే అతడిని గుర్తించి అతని వద్ద నుంచి సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడిని రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సెల్ ఫోనును బాధితునికి అందజేయడం జరిగిందని తెలిపారు.