ఏఐకి టీసీఎస్​ సై కృత్రిమ మేధపై నిపుణులకు శిక్షణ

ఏఐకి టీసీఎస్​ సై కృత్రిమ మేధపై నిపుణులకు శిక్షణ


ముంబై:కరోనా తదనంతర పరిణామాలతో ఐటీ, టెక్ రంగాల్లో పెను మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్​లో ఎదుర్కోవాల్సిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కోనేందుకు టీసీఎస్​ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు దాదాపు 25 వేల మంది ఇంజినీర్లను సిద్ధం చేస్తోంది. తమ టెక్కీలకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) టూల్స్‌పై శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  దీనికి అదనంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌లో కూడా తన కొత్త జనరేటివ్ ఏఐ ఎంటర్‌ప్రైజ్ అడాప్షన్ ఆఫర్‌ను కూడా ప్రారంభించనుంది టీసీఎస్. కస్టమర్లకు ఏఐ విషయంలో జంప్‌స్టార్ట్ చేయడంలో ఇది సహాయపడనుందని చెప్పొచ్చు. 

టీసీఎస్,  మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ ప్లాట్‌ఫాం అజూర్ మెషిన్ లెర్నింగ్ అండ్ అనలిటిక్స్‌లలో మైక్రోసాఫ్ట్ నుంచి స్పెషలైజేషన్స్‌ను పొందినట్లు వెల్లడించింది. ఇది టీసీఎస్​క్లయింట్లకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయడంలో.. ప్రోగ్రామర్ ప్రొడక్టివిటీ పెంచడంలోనూ సహాయపడుతుందని చెప్పొచ్చు. కొత్త కొత్త సాంకేతికతల్ని సద్వినియోగం చేసుకునేందుకు.. టీసీఎస్​ఇప్పుడు తన సొంత ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్స్‌ను మరింత మెరుగుపర్చుకుంటోంది. టీసీఎస్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ యూనిట్ ఇప్పటికే వందలాది గ్లోబల్ కస్టమర్ల కోసం 1000 కంటే ఎక్కువ సక్సెస్ అయిన అజూర్ ఎంగేజ్‌మెంట్లను పూర్తిచేసింది. ఇప్పటికే కంపెనీలోని 50 వేల మందికిపైగా ఉద్యోగులు ఏఐపైన శిక్షణ పొందారని టీసీఎస్ వెల్లడించింది. ఇప్పుడు మరో 25 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడు కంపెనీ వేస్తున్న అడుగులు.. భవిష్యత్తులో ఈ సంస్థ వ్యాపార పనితీరు మెరుగుపర్చేందుకు సహాయం చేస్తుందని భావిస్తున్నారు నిపుణులు. ఇక టీసీఎస్‌కు ప్రపంచదేశాల్లో వందలాది బ్రాంచ్‌లు ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షలకుపైనే ఉంది. ఇదే క్రమంలో మార్కె్ట్లు పడుతున్నా కూడా టీసీఎస్ షేరు వరుసగా లాభపడుతూనే ఉంది. ప్రస్తుతం దాదాపు ఒక శాతం పెరిగి రూ.3350 వద్ద ట్రేడవుతోంది.