మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.

మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.
  • కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్..
  • ఆర్డీఓ కు వినతి 

మెట్‌పల్లి ముద్ర :- మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రం లోని ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం మొక్కలు క్వింటాలకు 2200 ధర పలికిందని. నేడు 1850 నుండి 1900 వరకు మాత్రమే ధర వస్తుందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుని దళారులు రోజురోజుకు ధర తగ్గించడం వలన, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని. ఇటీవల అకాల వర్షాల వల్ల రైతులకు పంటలు సరిగా పండలేవని. పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారాన్నరు. ప్రభుత్వం తక్షణమే మార్క్ పెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి లింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల సంతోష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి కే క్రాంతికుమార్ ,మాజీ ఎంపీటీసీనా మిడి భూమేశ్వర్ , రైతులు గోపిడి అక్క పెళ్లి , చిలివేరి దిలీప్ గౌడ్ ,అగా బాలయ్య, రాము, ముకిమ్, తదితరులు పాల్గొన్నారు