నిజాంసాగర్ నుంచి 365 రోజుల పాటు సాగు నీరు

నిజాంసాగర్ నుంచి 365 రోజుల పాటు సాగు నీరు
  • కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం      
  • బాన్సువాడ బిఆరెస్ అభ్యర్థి పోచారం                            

బాన్సువాడ, ముద్ర:నిజాంసాగర్ చివరి ఎకరాకు  నీళ్ళు అందించడానికి రూ. 150 కోట్లతో నిజాంసాగర్ కాలువలను ఆధునీకరించామని,గత కొన్నేళ్లుగా ఎకరాం కూడా ఎండిపోకుండా పంటలను పండించుకుంటున్నామని, 365 రోజులు నిజాంసాగర్ నిండు కుండలా ఉండే విదంగా గోదావరి నీళ్ళను తీసుకువస్తున్నామని బాన్సువాడ బిఆరెస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నస్రుల్లాబాద్ మండలం రాములుగుట్ట తాండా, మైలారం, మీర్జాపూర్, బీర్కూరు మండలం వీరాపూర్ గ్రామాలలో బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు.    

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మంజీర నదిపై ఏర్పాటు చేసిన చిన్న ఎత్తిపోతల పథకాల కింద 25,000 ఎకరాలు సాగవుతుందని,మిగిలిన 25,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ. 200 కోట్లతో  సిద్దాపూర్ రిజర్వాయర్, రూ. 150 కోట్లతో జాకోర-చందూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని అన్నారు. రోజకు అయిదువేల క్యూసెక్కుల నీరు రావడానికి రూ. 1500 కోట్లతో మల్లన్న సాగర్ నుండి కాలువ, సొరంగం తవ్వుతున్నామని అన్నారు.  1994 లో మొదటిసారి MLA గా పోటి చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో చూసిన స్పందన మళ్ళీ ఇప్పుడు 2023 లో చూస్తున్నానని అన్నారు.అనుమానం లేదని,. మనం బంపర్ మెజారిటీతో గెలుస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ పదేళ్ళలో ఏం జరిగింది అనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగాలలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.పంట పెట్టుబడి కోసం రైతులకు రైతుబంధు ఇస్తున్నామని,24 గంటల నాణ్యమైన కరంటు సరఫరా చేస్తున్నామని, విత్తనాలు, ఎరువులకు కొరత లేదని,రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు.రైతులకు ఇబ్బందులు లేకుండా, ప్రవేటు వ్యాపారస్తుల చేతిలో మోసపోకుండా గత పది సంవత్సరాలుగా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని అన్నారు.మంజీర నదిలో నీళ్ళు వృదాగా పోకుండా  రూ. 150 కోట్లతో నాలుగు చెక్ డ్యాం లు నిర్మిస్తున్నామని అన్నారు.నవంబర్ 30 న జరిగే పోలింగ్ లో మీరందరూ కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాననని అన్నారు.  ప్రచారంలో DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు బద్యానాయక్,  మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.