బాన్సువాడలో జూనియర్ పంచాయతి అధికారుల భారీ ర్యాలీ

బాన్సువాడలో జూనియర్ పంచాయతి అధికారుల భారీ ర్యాలీ

బాన్సువాడ, ముద్ర: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ అధికారులు, సోమవారం నాడు బాన్సువాడ పట్టణంలో డివిజన్ స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల పాటు ప్రోబిషన్ తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికి మమ్మల్ని రెగ్యులర్ చేయడం లేదన్నారు.   కాలయాపన చేస్తూ మా భవిష్యత్తు తో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్ కటాఫ్ మార్కులు ఉన్నప్పట్టికి ఎంతో కష్టపడి చదివి పరీక్షలు వ్రాసి నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని విధుల్లో తీసుకొని ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా   నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టామని అన్నారు. ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేసి ఆదుకోవాలని వారు కోరారు.