అభివృద్ధి కోసమే కెసిఆర్ పోటీ  -ప్రభుత్వ  విప్ గంప గోవర్ధన్

అభివృద్ధి కోసమే కెసిఆర్ పోటీ  -ప్రభుత్వ  విప్ గంప గోవర్ధన్

ముద్ర ప్రతినిధి,కామారెడ్డి:కామారెడ్డి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారని ప్రభుత్వ విప్  గోవర్ధన్ అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసమే తాను ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి కేసీఆర్ను ఇక్కడి నుండి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు తాను ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు ఈ జీవితానికి ఇంతకుమించిన తృప్తి ఇంకా ఏముంటుందని అన్నారు బుధవారం మండలంలోని ఉగ్రవాయి రాఘవపూర్ క్యాసంపల్లి క్యాసంపల్లి తండా లింగయ్యపల్లి కొట్టాలపల్లి తిమ్మప్పల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య జెడ్పిటిసి లక్ష్మారెడ్డి మాజీ జడ్పిటిసి గోపి గౌడ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.