ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియ పూర్తి : కలెక్టర్

ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియ పూర్తి : కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా  ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని యెన్.ఐ.సి. కేంద్రంలో జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు  బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల కమీషన్ రూపొందించిన ఆన్ లైన్   సాఫ్ట్ వెర్ ద్వారా నిర్దేశించిన  2,405 మంది  ప్రిసైడింగ్ , సహాయ ప్రిసైడింగ్ అధికారులను  మొదటి ర్యాండమైజేషన్ ద్వారా  ఆయా నియోజక వర్గాలకు కేటాయిస్తున్నామని అన్నారు. .  రెండవ ర్యాండమైజేషన్ లో పోలింగ్ టీమ్ ను ఏర్పాటు  చేస్తామని, మూడవ ర్యాండమైజేషన్ లో ఆయా టీమ్ లకు పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తామని అన్నారు.  మొదటి ర్యాండమైజేషన్ లో నియోజక వర్గాలకు కేటాయించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు  మాస్టర్ ట్రైనీల ద్వారా  ఈ నెల 28, 30 తేదీలలో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. ఈ నెల 28 న ఉదయం పదిన్నర గంటలకు మద్నూర్, నిజాంసాగర్, dongli , పిట్లం మండలాల వారికి బిచ్కుంద లోని ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో,, బాన్సువాడ,బీర్కూర్, నస్రుల్లాహాబాద్ వారికి బాన్సువాడలో  ఎస్.ఆర్.యెన్.కి. ప్రభుత్వ డిగ్రీ కళాల్శాలలో,  గాంధారి, నాగిరెడ్డిపేట,లింగంపేట, సదాశివనగర్ వారికి ఎలారెడ్డిలోని మోడల్ డిగ్రీ కళాశాలలో,కామారెడ్డి,బీబీపేట్, రామారెడ్డి  వారికి కామారెడ్డిని లోని ప్రభుత్వ డిగ్రీ కళాళాశాలలో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు.. అదేవిధంగా ఈ నెల 30 న బిచ్కుంద, జుక్కల్, పెద్దకోడపగల్ వారికి బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, తాడ్వాయి  యెల్లారెడ్డి, రాజంపేట , రామారెడ్డి వారికి  ఎలారెడ్డి లోని మోడల్ డిగ్రీ కళాశాలలో,బిక్నూర్, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట మండలాల వారికి కామారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు.    వారు ఈ.వి.ఏంలు, వివిప్యాట్ ల నిర్వహణ, మాక్ పోలింగ్, ఓటింగ్ యంత్రాలలో సాంకేతిక సమస్య తలెత్తితే నిబంధనలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలు, ఇలా  ప్రతి అంశాన్ని జాగరూకతో పర్యవేక్షించాలని సూచించారు.  
   

ఈ కార్యక్రమంలో మ్యాన్ పవర్ నోడల్ అధికారి రాజారామ్, రఘునందన్, యెన్.ఐ.సి. నెట్ వర్క్ ఫిల్డ్ఇంజనీర్  శ్రీకాంత్, ఈడియం  ప్రవీణ్ కుమార్,కలెక్టరెట్ ఏ.ఓ. మసూర్   అహ్మద్  తదితరులు పాల్గొన్నారు.