రాజకీయ పార్టీలు బూత్ లెవల్ అధికారులను నియమించుకోవాలి: కలెక్టర్

రాజకీయ పార్టీలు బూత్ లెవల్ అధికారులను నియమించుకోవాలి: కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఓటర్ల జాబితాలలో మృతి వారి పేర్లు తొలగింపు పై రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వారిగా మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని తెలిపారు. బూత్ ఏజెంట్లు తమ బూత్ పరిధిలో పది మంది ఫారంలను మార్పులు, చేర్పుల కోసం బూత్ లెవెల్ అధికారికి ఇవ్వవచ్చని చెప్పారు.

ఒక వ్యక్తికి నాలుగు ఓట్లు ఉంటే వాటిని గుర్తించి మూడు తొలగించే విధంగా చూడాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. ఒక ఇంటిలో ఐదు ఓట్లు ఉంటే వారి పేర్లు ఒకే వార్డులో కాకుండా ఇతర వార్డుల్లో వచ్చాయని రాజకీయ పార్టీల నాయకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఓకే ఇంటిలో ఉండే ఐదుగురు ఓటర్లు అదే వార్డులో ఉండే విధంగా బూత్ లెవల్ అధికారికి దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి, పరిష్కారం చేయిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు , వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.