ఫ్లైట్​ టికెట్​ కొనలేని వారు.. నేడు స్పెషల్​ ఫ్లైట్లలో విహారం

ఫ్లైట్​ టికెట్​ కొనలేని వారు.. నేడు స్పెషల్​ ఫ్లైట్లలో విహారం
  • తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్న కేసీఆర్​ కుటుంబం
  • మధ్యం మాఫియాలో కింగ్​క్వీన్​ కవిత
  • దోపిడీపై అప్రమత్తం కావాలంటూ మధుయాష్కీ ప్రజలకు పిలుపు

ముద్ర తెలంగాణ బ్యూరో: రెండు పడకగదులున్న...ఫ్లైట్​ టికెట్​ కొనలేని వారు నేడు రూ.150కోట్ల విల్లాతో పాటు స్పెషల్​ఫ్లైట్​లో వెళ్తున్నారని, ఇదంతా తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నదేనని, కేసీఆర్​ కుటుంబం దోపిడీపై ప్రజలు మెల్కొనాలని టీపిసిసి ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ గౌడ్ ప్రజలను కోరారు. మంగళవారం సాయంత్రం గాంధీభవన్​లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ  60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాలను గుర్తించి, ఆత్మబలిదానాలపై చలించిపోయి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఇచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం రాబందుల్లా దోచుకుంటున్నారని ఆరోపించారు.   ఇసుక నుంచి మద్యం మాఫియా లో వేలకోట్లు కాజేశారని, కాళేశ్వరంతో కమీషన్లు నొక్కారని మధుయాష్కీ దుయ్యబట్టారు.  బతుకమ్మా పేరుతో  బ్రతక నేర్చిన కల్వకుంట్ల కవిత వేల కోట్లకు ఎలా పరుగెత్తారని ప్రశ్నించారు. మరో నేత  టానిక్ అనే పేరుతో చెట్ల సంతోష్ మద్యం తాగిస్తుండని ఆరోపించారు. తెలంగాణాను ఆంద్రోళ్లు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్​, ఆయన కూతురు నేడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో కలసి కవిత మద్యం వ్యాపారం చేసిందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో మధ్యం విక్రయాల ద్వారా రూ.10వేల కోట్లు వచ్చేదని, నేడు రూ.40వేల కోట్ల మేరకు చేరిందని తెలిపారు. మద్యం స్కాంలోమాస్టర్​ మైండ్​ కింగ్​ క్వీన్ కవిత అని,అ లాంటి వ్యక్తిని అరెస్ట్​ చేయడం లేదని, దీంతోనే బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాగా తేలిపోయిందన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎంను ఆరెస్ట్​ చేసి, కవితను ఎందుకు అరెస్ట్​ చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వడగండ్ల వానలు, లీకేజీ, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న పట్టించుకోకుండా మంత్రులంతా ఢిల్లీలో మకాం వేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్​ఎస్​ కాదని నేడు కేఆర్​ఎస్​(కవిత రక్షణ సమితి) అని ఆయన ఎద్దేవా చేశారు. ఆరోగ్యం బాగా లేకునాన సోనియాగాంధీని ఈడీ విచారణ చేసిందని, అప్పుడు లేని మహిళల హక్కులు ఇప్పడు కవితకు గుర్తు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హక్కులపై ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కసారిగా మాట్లాడావా? అంటూ కవితను మధుయాష్కీ ప్రశ్నించారు. రాష్ట్రానికే కాదు కవిత లిక్కర్​ దందా ఢిల్లీ వరకు విస్తరించిందన్నారు.  తొమ్మిది ఏళ్లలో  బీఆర్​ఎస్​ ఎంపీ లు ఎప్పుడైన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారా?  అని ప్రశ్నించారు.  ఏ తప్పూ చేయనపుడు  సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్ళవ్? తప్పు చేయనపుడూ భయం ఎందుకు? అని కవితను ప్రశ్నించారు. గవర్నర్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహిళగా  అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

 ఇప్పటికే ఈ కేసులో బీఆర్​ఎస్​ పార్టీ లబ్ధి దారుడు డిల్లి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ చేశారని,  మాస్టర్ మైండ్ కింగ్ క్వీన్ కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరన్నారు.  ఎమ్మెల్సీ కవితకు ఖరీదైన వాచ్​లు, వందల కోట్లు విలువ చేసే విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నించారు.  తెలంగాణలో మద్యం సరఫరా  పై కూడా ఈడి, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని ఆధాని కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చదానికి బీజేపీది, లిక్కర్ స్కాం తెర మీదకు తెచ్చారని ఆరోపించారు.  లండన్ లో రాహుల్ గాంధీ ప్రస్తుత భారత దేశంలో ఉన్న పరిస్థితులు,గురుంచి మాట్లాడారే  తప్ప దేశాన్ని కించపరిచేలా మాట్లాడలేదని, తానుప్రత్యక్ష సాక్షినని తెలుపుతూ అక్కడ మాట్లాడిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొంద పెట్టాలని, ప్రజలు మేల్కొనాలని, లేకుంటే అంతేనంటూ ఆయన అన్నారు.  టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జహీర్​లలాని తదితరులున్నారు.