అమిత్​ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్​లో మళ్లీ హోర్డింగ్స్​

అమిత్​ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్​లో మళ్లీ హోర్డింగ్స్​
Hoardings against Amit Shah in Hyderabad

బీజేపీని టార్గెట్ చేస్తూ హైదరాబాద్‌లో మరోసారి హోర్డింగులు వెలిశాయి. కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో  బీజేపీని ఎద్దేవా చేస్తూ పోస్టర్లు, హోర్డింగులు పెట్టారు. ఆదివారం  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన సందర్భంగా హోర్డింగులు దర్శనమిచ్చాయి.  ‘బీజేపీలో చేరితే మరకలు పోతాయి’ అని అర్థం వచ్చేట్టుగా ఈ హోర్డింగులను పెట్టారు. హోర్డింగ్ పై భాగంలో వాషింగ్ పౌడర్ నిర్మా అని.. కింది భాగంలో ‘వెల్‌కమ్‌ టు అమిత్‌ షా’ అని రాశారు.  

నిర్మా యాడ్ లో ఉండే అమ్మాయి ఫొటోలో ముఖాన్ని మార్చారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన హిమంత బిశ్వ శర్మ, నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా, విరూపాక్షప్ప, అరుణ్ ఖోట్కర్ మొఖాలను పెట్టారు. నిన్నటి మాదిరే ఈ రోజు కూడా హోర్డింగ్స్ ఎవరు వేశారనే వివరాలు పెట్టకపోవడం గమనార్హం.