కవితపై కేసీఆర్ చర్యలెందుకు తీసుకోవట్లేదు?

కవితపై కేసీఆర్ చర్యలెందుకు తీసుకోవట్లేదు?

హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ,  సీబీఐని బీజేపీ జేబు సంస్థలుగా మార్చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌ కేసులో ఏం జరుగుతోందో ఈడీ వివరణ ఇవ్వట్లేదని, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా పట్ల వ్యవహరించినట్లు..లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదు? అని రేవంత్‌ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై చర్యలెందుకు తీసుకోవట్లేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి పేపర్ పులుల్లా అరుస్తున్నారని, కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్రమంత్రులే చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతిపై తాను ఫిర్యాదు చేస్తే ఎందుకు విచారణ చేపట్టలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యవహారం గురవిందగింజ చందంగా ఉందని, సంజయ్‌, బీఆర్​ఎస్​ మధ్య చీకటి ఒప్పందమేంటో ప్రజలే గుర్తిస్తారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.