జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ కవితలకు బిగ్ షాక్  

జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ కవితలకు బిగ్ షాక్  
  • మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో రెబల్ అభ్యర్థికి జైకొట్టిన బిఆర్ ఎస్ అభ్యర్థులు 
  • జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా బిఆర్ ఎస్  రెబల్ అభ్యర్థి  అడువాల జ్యోతి ఎన్నిక 
  • పలించని గోవా క్యాంపు .... బిఆర్ ఎస్ చేతిలోంచి కాంగ్రెస్ లోకి చేజారిన మున్సిపల్ 
  • కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ కవితలకు  ఆ పార్టీ కౌన్సిలర్లు బిగ్ షాక్ ఇచ్చారు. కౌన్సిలర్లు వారి మాటను జవదాటి రెబల్ అభ్యర్థి ఆయన అడ్వాల జ్యోతిలక్ష్మణ్ కు జై కొట్టారు. బిఆర్ఎస్ కౌన్సిలర్ల గోవా క్యాంపు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు వారిలో కొందరు  కూడా రెబెల్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యేతో పాటు అందరూ షాక్ గురయ్యారు.   జగిత్యాల బల్దియా బిఅర్ ఎస్ చైర్పర్సన్ గా కొనసాగిన బోగ శ్రావణి పార్టీ అంతర్గత వ్యవహారాలతో గతేడాది రాజీనామా చేసి బిజెపిలో చేరారు.
అప్పటినుంచి వైస్ చైర్మన్ గా ఉన్న గోలి శ్రీనివాస్ కు మున్సిపల్ చైర్మన్ గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకొచ్చిన కొత్త జీవ ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే గతంలో బోగ శ్రావణి  పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చైర్ పర్సన్  కావడంతో తమ సామాజిక వర్గానికి మళ్లీ చైర్పర్సన్ ఇవ్వాలని  అడువాల జ్యోతి లక్ష్మణులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ కవితలను కోరారు. వారికే ఇస్తారని కూడా ప్రచారం జరిగింది.  సమిల్లా వాణి శ్రీనివాసులు తాము మొదటి నుంచి పోటీలో ఉన్నామని తమను కాదని అప్పుడు  శ్రావణికి ఇచ్చారని ఈసారైనా తమకి అవకాశం ఇవ్వాలని వారు కోరారు. అలాగే తనకు కౌన్సిలర్ల మద్దతు ఉందని చైర్పర్సన్ అవకాశం కల్పించాలని వల్లెపు రేణుక మొగిలి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కలిసి వారి ప్రయత్నాలు వారు ఏడాదికాలంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈమధ్య నోటిఫికేషన్  వెలువడగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కౌన్సిల్ సభ్యులను పిలిపించుకొని వారికి నచ్చజెప్పి సమీన్ల వాణి కి సపోర్ట్ చేయాలని కోరారు.
ఈ మేరకు సమిండ్ల వాణి శ్రీనివాస్ కౌన్సిల్ సభ్యులను గోవా ట్రిప్ కు తీసుకొని వెళ్లి బుధవారం మున్సిపల్ లో జరగనున్న చైర్ పర్సన్ ఎన్నిక కేంద్రానికి తీసుకొని వచ్చారు. అయితే వల్లెపు రేణుక మొగిలి, అడువాలా జ్యోతి లక్ష్మణులు వారి ప్రయత్నాలు వారు చేస్తూ వచ్చారు. జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్లో 48 వార్డులు ఉండగా, బోగస్ శ్రావణి రాజీనామాతో ఆ వార్డు ఖాళీ ఏర్పడింది. 47  వార్డులలో 35 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. వీరికి ఎన్నికలకు ఒక రోజు ముందే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విప్ జారీ చేశారు. బుధవారం జరిగిన చైర్ పర్సన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా సమీడ్ల వాణి నామినేషన్ దాఖలు చేయగా, బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా అడ్వాల జ్యోతి నామినేషన్ దాఖలు చేశారు. కౌన్సిల్లో 48 స్థానాలకు ఒక స్థానం ఖాళీగా ఉండగా 47 మంది కౌన్సిల్ సభ్యులగాను ఒక బిఆర్ఎస్ కౌన్సిల్ సభ్యుడు ముసుకు నారాయణరెడ్డి గైర్హాజర్ కాగా 46 మంది సభ్యులు హాజరయ్యారు.
బిఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి సమిండ్ల వాణీకి 22 మంది బిఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలుపుకొని 23 మంది మద్దతు తెలిపారు. రెబల్ అభ్యర్థి అడ్వల జ్యోతికి 5 స్వతంత్ర, 1 ఎం ఐ ఎం,6 కాంగ్రెస్, 2 బి జే పీ, 9  మంది బి అర్ ఎస్ రెబల్ కౌన్సిల్ సభ్యులు, ఒక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యురాలు తో కలుపుకొని 24 మంది కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా అడ్వాల జ్యోతి లక్ష్మణ్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే చైర్ పర్సన్ పదవి కోసం పోరాడిన వల్లెపు రేణుక మొగిలిలు కూడా అడువాల జ్యోతి లక్ష్మణులకు మద్దతు తెలిపి చైర్పర్సన్ ఎన్నికకు సహకరించారు. మొత్తానికి కాంగ్రెస్, బిజెపి, స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని బిఆర్ ఎస్ చేతిలో ఉన్న మున్సిపల్ కౌన్సిల్ ను  రెబల్ అభ్యర్థి కొల్లగొట్టారు.
చైర్ పర్సన్ గా గెలుపొందిన అడ్వాల జ్యోతి లక్ష్మణులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రేస్ పార్టి నాయకులను కలిశారు. దీంతో చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలు స్పష్టం అవుతున్నాయి.  పూర్తిస్థాయి బిఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులు ఉన్న జగిత్యాల మున్సిపల్ కాంగ్రెస్ చేతిలోకి మారిపోయినట్లు అయింది. అయితే శ్రావణి రాజీనామాతో అదే సామాజిక వర్గానికి చెందిన ఆడువాల జ్యోతి లక్ష్మణులకు చైర్ పర్సన్ పదవి కట్టబెట్టి ఉంటే బి ఆర్ ఎస్ మున్సిపల్ కౌన్సిల్ ను  కోల్పోయేది కాదని పలువురు పేర్కొంటున్నారు. గోవా ట్రిప్ కి వెళ్ళిన బిఆర్స్ కౌన్సిల్ సభ్యులు కూడా రెబల్ అభ్యర్థి జ్యోతి కి మద్దతు తెలపడం విశేషం.