కర్నాటకలో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం 

కర్నాటకలో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం 

కర్నాటకలో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తమకు ఎవరి మద్దతు అవసరం లేదని చెప్పిన కాంగ్రెస్​ నాయకుడు సిద్ధ రామయ్య. కాంగ్రెస్​ ఓట్ల సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు. మత రాజకీయాలు కర్నాటకలో పనిచేయవని అన్నారు.

గంగావతిలో  కేఆర్​పీపీ అభ్యర్థి  గాలి జనార్థన్​ రెడ్డి గెలుపు


గంగావతిలో గాలి జనార్థన్​ రెడ్డి   (కేఆర్​పీపీ)  గెలిచారు. చిత్తాపూర్​లో కాంగ్రెస్​ అభ్యర్థి ప్రియాంక ఖర్గే విజయం సాధించారు. బళ్ళారిలో కాంగ్రెస్​ అభ్యర్థి నాగేంద్ర గెలిచారు. తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి కాంగ్రెస్​ స్పీడ్​ పెంచింది. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులను బెంగళూరుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులను తరలించడానికి కాంగ్రెస్​ 12 హెలికాప్టర్లను సిద్ధం చేసింది.

సిగ్గావ్​లో సీఎం బొమ్మై ఘన విజయం


కర్నాటకలోని సిగ్గావ్​లో సీఎం బొమ్మై ఘన విజయం సాధించారు.  హసన్​లో జేడీఎస్​ అభ్యర్థి స్వరూమ్​ గెలిచారు. చల్లకెరెలో కాంగ్రెస్​ అభ్యర్థి రఘుమూర్తి గెలిచారు. ఎల్లాపూర్​లో బీజేపీ అభ్యర్థి శివరామ్​ విజయం సాధించారు.