రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
  • రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్ రెడ్డి

ముద్ర, పానుగల్:-రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్ రెడ్డి,కార్యదర్శి పరమేశ్వర చారి అన్నారు.తెలంగాణ రైతు సంఘం (AIKS) తెల్ల రాళ్లపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రైతు సంఘం సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్నో రోజుల నుండి రైతులకు రాతపూర్వకమైన హామీ ఇచ్చిన కేంద్ర బిజెపి ప్రభుత్వం  అమలు చేయకుండా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని లాఠీలతో అనుచివేస్తూ ఇద్దరు రైతుల మరణానికి కారణమైన బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే లోకసభ ఎన్నికల్లో ఓడించాలని వారు డిమాండ్ చేశారు.

పార్లమెంటులో కనీస మద్దతు ధరల చట్టం ఏర్పాటు చేయాలని ఆన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామాలలో సాగు నీరు అందకపోవడంతో మామిడి తోటలు, ఇతర పంటలు ఎండిపోవడం జరుగుతుందన్నారు. కాబట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి కాలువలకు సాగు నీరు అందించాలని రైతుల పక్షాన కోరారు. జూరాల కాలువ కింద ఉన్న రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జూరాల కాలువ కూడా సాగు నీటిని విడుదల చేయాలని కోరారు.గతంలో పంట నష్టపోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు జంబులయ్య, నాయకులు భీమయ్య, శివుడు, సాయిలు, శేఖర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.