పల్స్ పోలియో ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి

పల్స్ పోలియో ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా కేంద్రంలోని  బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన  పల్స్ పోలియో కేంద్రాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల లోపు  పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, వికలాంగత్వం నుంచి కాపాడాలని కోరారు. ఏవైనా అనివార్య పరిస్థితుల్లో రాలేని వారు మరో రెండు రోజులు ఈ కార్యక్రమం ఉన్నందున ఈ పోలియో చుక్కలను వేయించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.