అక్రమంగా అరెస్ట్ చేసిన కవ్వంపల్లిని విడుదల చేయాలి

అక్రమంగా అరెస్ట్ చేసిన కవ్వంపల్లిని విడుదల చేయాలి

శంకరపట్నం, ముద్ర : శంకరపట్నం మండలంలో డిసిసి అధ్యక్షుడు కొవ్వంపల్లి సత్యనారాయణ ని అక్రమంగా అరెస్ట్ చేశారని అతనిని వెంటనే విడుదల చేయాలని మండల కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ ని ముట్టడి చేశారు. వీరి ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ నాయకుడైన కవ్వంపల్లి ని వెంటనే విడుదల చేయాలని  డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీగా ర్యాలీ  తీశారు. వీరిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు.తమ నాయకుడిని విడుదల చేయకుంటే మమ్మల్ని అందర్నీ కూడా అరెస్ట్ చేయాండని కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకొచ్చారు.