పర్లపల్లి గ్రామాన్ని సందర్శించిన స్థంభంపల్లి, పాసిగామ గ్రామస్థులు

పర్లపల్లి గ్రామాన్ని సందర్శించిన స్థంభంపల్లి, పాసిగామ గ్రామస్థులు

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ప్యాక్టరీతో ప్రజలకు అన్ని విధాల ప్రమాదం ఉందని ప్రాజెక్ట్ బాధితులు పేర్కొంటున్నారు. గురువారం మండలంలోని స్థంభంపల్లి, పాసిగామకు సంబందించిన ప్రజలు  బస్సులో వెళ్లి కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలంలోని పార్లపల్లి గ్రామంలో ఉన్న ప్యాక్ట రీని సందర్శించారు. అక్కడి ప్రజలను అడిగి పరిస్థితి ని తెలుసుకున్నారు. కాగా ప్యాక్ట రీ వలన అస్తమా, చర్మ వ్యాదులు వస్తున్నాయని, దూర్వాసనను భరించలేక పోతున్నామని తెలిపారు.

జల కాలుష్యం, వాయు కాలుష్యం తో పాటుగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ప్యాక్టరీ నిర్మాణం జరిగేంత వరకె నిబంధన పాటిస్తామని చెప్పుతారని, అతర్వాత అధికారులు, నాయకులు ఎవ్వరు పట్టించుకున్న పాపాన. పోరని ఆవేదన వ్యక్తం చేశారు. మీ. ప్రాంతంలో ప్యాక్టరీ నిర్మాణం జరుగకుండా ప్రజలంతా కలిసి పోరాడమని పేర్కొన్నారు. గ్రామ సందర్శన అనంతరం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల స్వామిని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. కాగా ప్యాక్టరీని నిలుపుదల చేసే విషయంలో తమ మద్దతు ఉంటుందని వారు ప్రకటిచ్చినట్లు తెలిపారు