ఘనంగా చంద్ర రథోత్సవం .. బారులు తీరిన భక్తులు

ఘనంగా చంద్ర రథోత్సవం .. బారులు తీరిన భక్తులు

జమ్మికుంట, ముద్ర...జై బోలో సీతారాం కి... రామ లక్ష్మణ జానకి అంటూ వందలాదిమంది భక్తుల రామనామ స్మరణల మధ్య ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి చంద్ర రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారామ లక్ష్మణ సమీతుడైన ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గురువారం రాత్రి చంద్ర రథంపై అలంకరించారు .అనంతరం భక్తుల దర్శనం కోసం చంద్ర రథోత్సవమును ముస్తాబు చేయగా అర్ధరాత్రి నుండి వందలాది మంది భక్తులు సీతారాములను దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ ,యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డిలు సీతారాముల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లను చేశారు. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజురాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై తోట తిరుపతి భారీ బందోబస్తును నిర్వహించారు. సాయంత్రం చంద్రరతాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.