చలివేంద్రాలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలి

చలివేంద్రాలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలి
  • వాహనదారులకు కార్మికులకు  మజ్జిగ పంపిణీ
  • ఏ ఐ ఎఫ్ బి జాతీయ నాయకులు అంబటి జోజరెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు కరీంనగర్ నగరమంతటా ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నిరసన తెలియజేయటం జరిగింది. వాహనదారులకు, ఆటో, బస్ డ్రైవర్లకు కార్మికులకు  మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.
 ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్  రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ  గత వారం రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ మున్సిపల్ నగర పాలక సంస్థ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ నగరంలో ఎక్కడ కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక్క చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. నగరంలోని పన్నులు కట్టుతున్న ప్రజల సౌకర్యం కోసం ఏమి ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. స్మార్ట్ స్మార్ట్ సిటీ నిధులు వచ్చినప్పటికీ అభివృద్ధి చేయడంలో   నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం  ఉపాధి పనులు చేసే కేంద్రాల వద్ద కార్మికుల కోసం టెంట్లు,  మంచినీటి సౌకర్యం  ఏర్పాటు చేయాలని అన్నారు.

 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం రావు, జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్, జి. ప్రశాంత్ కుమార్,  చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెల్లి శేఖర్, నాయకులు పాల్గొన్నారు.