సతమతమవుతున్న చిరు వ్యాపారులు

సతమతమవుతున్న చిరు వ్యాపారులు
  • పార్కింగ్ స్థలం లేక వాహనదారులు ఇబ్బందులు 
  • గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ప్రధాన కూరగాయల మార్కెట్, అన్నపూర్ణ కాంప్లెక్స్ ఏరియాలో చిరువ్యాపారులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన కూరగాయల మార్కెట్, అన్నపూర్ణ కాంప్లెక్స్, మదీనా కాంప్లెక్స్ ఏరియాలో వ్యాపారులను ప్రజలను కలుసుకుంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ లోనే అత్యంత జన సమ్మర్థం తిరిగే కూరగాయల మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండడం దురదృష్టకారం అన్నారు. దీంతో వాహనదారుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. సరైన పార్కింగ్ స్థలం లేకపోవడం ఇందుకు కారణం అన్నారు.

కూరగాయల వ్యాపారులకు సరైన స్థలం కేటాయించకుండా మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. చిరువ్యాపారులు పలు సమస్యలు మా దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. పాలకులు సమస్యలు గాలికి వదిలేసి కరీంనగర్ ను అభివృద్ధి చేశామని పదే పదే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బాధ్యుడు దన్నసింగ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండి చాంద్,దండి రవీందర్, గడ్డం విలాస్ రెడ్డి, షబానా మహమ్మద్, ఊరడి లత, ముల్కల కవిత, అన్నే జ్యోతిరెడ్డి, శారద, చంద్రయ్య గౌడ్, జీడి రమేష్, ముక్క భాస్కర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, నెల్లి నరేష్, సలిమొద్ధిన్,గంగుల దిలీప్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.