ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్..

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్..

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా అదనప కలెక్టర్ జివి శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు. చివరి గింజ వరకు  కొనుగోలు చేస్తామని ఆ దిశగా ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది కలుగుతే మండల తహసిల్దార్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తూకం చేసిన ధాన్యం సంచులను వెంటది వెంటనే రైస్‌ మిల్లర్లకు తరలించే విధంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు.అయన వెంట ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకట రమణారెడ్డి, తహసిల్దార్ ముబీన్  అహమ్మద్, స్థానిక సర్పంచ్ బెజ్జంకి లక్షన్, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి,  ఏపీఎం  మట్టెల సంపత్, సీసీ డి సత్యం రైతులు తదితరులు ఉన్నారు.