నేరస్తులపై నిఘా పెంచాలి. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్..

నేరస్తులపై నిఘా పెంచాలి. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్..

మెట్‌పల్లి ముద్ర: గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులు, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.బుధవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేరస్తుల, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందికి పలు సూచనల మేరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్.ఐ లు చిరంజీవి,ఉమా సాగర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.