నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్ద

నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్ద
  • నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేస్తే  PD ఆక్ట్  నమోదు చేస్తాం. ..
  • జిల్లాలో 10 మంది నకిలీ ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ  ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విదేశాల్లో ఉద్యోగాల కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ గుర్తింపు వున్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించాలని జిల్లా ఎస్పీ  ఎగ్గడి భాస్కర్ సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగరీత్యా గల్ఫ్ వెళ్ళే అభ్యర్థులకు వీసాలు ఇప్పించే ప్రభుత్వ ఆమోది పొందిన 25 ఏజెన్సీల తో జిల్లా ఎస్పీ  సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ  నిరుద్యోగ యువతి యువకులు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నించే ముందు సంబందిత ఏజెంట్లకు అనుమతి ఉందా లేదా అని తెలుసుకోవాలన్నారు. ఏజెన్సీలు, ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారు నేరుగా పోలిసులకు  పిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుని, నేరం రుజువు అయితే వారి ఫై PD ఆక్ట్ పెడుతామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 10 మంది నకిలీ ఏజెంట్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, వారిని బైండోవర్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు రవీంద్రరెడ్డి, ప్రకాష్, SB ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.

  ఉపాధి నిమిత్తమై గల్ఫ్ వెల్లె నిరుద్యోగ యువతకు పోలీస్ ల సూచనలు:

జగిత్యాల జిల్లాలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళు యువకులు లైసెన్స్ కలిగి ఉన్న  ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించి, వారి ద్వారానే వీసాలు పొందవలెను.
*  అభ్యర్థుల నుంచి లైసెన్స్ గల సంస్థలు పాస్ పోర్ట్ , ఇతర ధ్రువీకరణ పత్రముల జిరాక్స్ కాపీలను మాత్రమే తీసుకోని,  లైసెన్స్ గల సంస్థ POE (Protector of Emigrants) ద్వారా విదేశీ కంపెనీలతో ఉద్యోగ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అభ్యర్థులకు సమాచారం ఇస్తారు.
*  విదేశీ కంపెనీలు అభ్యర్థులకు ఇచ్చిన వీసా, ఆఫర్ లెటర్ లో  ఉద్యోగ వివరాలు, వేతన అంశాలను అభ్యర్థులు జాగ్రత్తగా చూసుకోవాలి.
* అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో డబ్బులను ఏజెన్సీ వారికి ఇవ్వకూడదు
*  అభ్యర్థులు  వారి యొక్క పాస్పోర్ట్  ను అనాథరైజ్డ్ పర్సన్స్ కు ఇవ్వరాదు
*  అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో టూరిస్ట్ వీసా క్యాజువల్ వీసా లను ఆమోదించరాదు
* ఎవరైనా అభ్యర్థులు ఏజెన్సీలచే మోసపోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీసు సహాయం పొందగలరు.

ప్రభుత్వ ఆమోదిత పొందిన ఏజెన్సీస్ వారికి జిల్లా పోలీస్ శాఖ సూచనలు:

*  లైసెన్స్ ఏజెన్సీలో షరతులకు లోబడి మాత్రమే పనిచేయాలి.
*  వీసా లకు వచ్చే అభ్యర్థుల వద్ద నిర్దేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలి.
*  ఉద్యోగ వీసా గురించి వచ్చే వారికి విసిట్ మరియు టూరిస్ట్ వీసా  ఇవ్వకూడదు.
*  అభ్యర్థులను ఆకర్షించుటకు వాస్తవానికి మించి జీతభత్యాలను చూపించకూడదు.
*  లైసెన్స్ గల ఏజెన్సీలు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీల వివరాలు, జీతభత్యాలు మరియు ఇతర సమాచారాన్ని అభ్యర్థులకు సరిగ్గా తెలుపాలి.
* అభ్యర్థుల వద్ద నుండి ఎక్కువ మొత్తంలో మెడికల్ టెస్ట్ మరియు ఫ్లైట్ టికెట్  వంటి ఇతర చార్జీలను తీసుకోరాదు.
*  ప్రభుత్వ లైసెన్స్ కలిగిన వారు తమ యొక్క ఏజెన్సీలను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే నెలకొల్పాలి