సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి.
  •  ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు
  • స్వేచ్ఛయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి
  •  జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ 

 ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛాయుత వాతవరణం లో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక (క్రిటికల్) గ్రామాలను, అక్కడి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్నీ ఏర్పాట్లు  ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని, ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ప్రజలు ఎలాంటి గొడవలు పోకుండా, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో  ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా ప్రలోభాల గురి చేసిన భయభ్రాంతులకు గురి చేసిన వెంటనే సంబంధిత అధికారులకు  తెలియజేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవీంద్ర రెడ్డి, సి.ఐ లక్ష్మీనారాయణ , ఎస్.ఐ ఉమాసాగర్, సిబ్బంది పాల్గొన్నారు.