మిర్చి డెవలపర్స్ సక్సెస్ మీట్ గ్రాండ్ సక్సెస్
- ప్రతీ చదరపు అడుగు రూ.10వేలు
- భవిష్యత్లో 20 వేలకు చేరే అవకాశం
- ఎండీ మోర్తల శ్రీనివాసరెడ్డి
- నియోపోలిస్ వెంచర్ కు దగ్గర్లో మిర్చీ డెవలపర్స్
ముద్ర ప్రతినిధి, హైదరాబాద్: ఎకరా వందకోట్లు పలికిన నియోపోలిస్ వెంచర్ కు అతి దగ్గరలో మిర్చీ డెవలపర్స్ ఉండడం తమ ప్రాజెక్టుకు మరింత ఆకర్షణ వచ్చిందని మిర్చి డెవలపర్స్ ఎండీ మోర్తల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో మొత్తం ప్లాట్లు సేల్ అయినా కాకున్నా, ముందుగా తాము నిర్ణయించుకున్నట్లుగా ప్రతి ప్లాట్ లోనూ విల్లా కన్ స్ట్రక్షన్ ను పూర్తిచేసి, రెండున్నర సంవత్సరాల కాలంలోనే వినియోగదారులుకు అందుబాటులోకి తేవడం గొప్ప విషయమని వినియోగదారరులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మిర్చి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మోర్తల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి చదరపు అడుగు రూ.10 వేలు పలుకుతున్నదని తెలిపారు. కాగా భవిష్యత్లో ఈ ధరలు చదరపు అడుగు రూ.20 వేలకు చేరినా ఆశ్చర్యం లేదని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే తాము ఇచ్చే క్వాలిటీ, సదుపాయాలు అలాంటివని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మిర్చి డెవలపర్స్ సక్సెస్ మీట్ కు వచ్చిన ప్రతి వినియోగదారుడూ ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగస్వాములు అయినందుకు తమ సంస్థకెంతో గర్వంగాఉందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో రికార్డు టైమ్ లో సేల్స్, కన్ స్ట్రక్షన్, డెలివరీ కార్యకలాపాలలో అంకితభావంతో భాగస్వాములైన తమ సంస్థ సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
విజయవంతంగా వెంచర్లు పూర్తి..
మిర్చి డెవలపర్స్ మేనేజ్ మెంట్ పాటి.. కొల్లూరులో వెనిస్ సిటీ ప్లాట్ల వెంచర్ ను విజయవంతంగా పూర్తి చేశామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ను మార్చి 2021న మొదలుపెట్టి 2023 దసరా నుంచి విల్లాలను డెలివరీ ఇవ్వనుంది. రికార్డు టైమ్ లో ప్రాజెక్టును పూర్తిచేసిన మిర్చీ డెవలపర్స్ మేనేజ్ మెంట్ రెండున్నర ఏళ్లలో 247 విల్లాలు, 16 ఎకరాల ప్రాజెక్టు క్వాలిటీలో ఎక్కడా రాజీపడకుండా డెలివరీ ఇవ్వడం రియల్ ఎస్టేట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పిందని సక్సెస్ మీట్ కు వచ్చిన వినియోగదారులే ప్రశంసించడం విశేషమని ఆయన అన్నారు. వెనిస్ సిటీ బ్రోచర్ లో చెప్పినవే కాకుండా ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్, సెపరేట్ పవర్ ఫీడర్, బ్యాటరీ కార్, మంజీరా వాటర్ కనెక్షన్, గుడి, 15 అడుగుల ఎత్తుగల ఫంక్షన్ హాలు, పచ్చదనంతో కూడిన పార్కులు, 20వేల అడుగుల క్లబ్ హౌస్, ఎలివేటెడ్ స్విమ్మింగ్ పూల్, తదితర ఎన్నో ప్రత్యేక సదుపాయాలు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా మిర్చి డెవలపర్స్ వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి చదరపు అడుగుకు ఇలాంటి లగ్జరీ సదుపాయాలు కల్పించడంవల్ల తమ విల్లాలపై తాము పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతున్నందుకు తమకెంతో ఆనందంగా ఉందని వినియోగదారులు సంతృప్తి వ్యక్తంచేసినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.