పెరిగిన బంగారం, వెండి ధరలు

పెరిగిన బంగారం, వెండి ధరలు

బుధవారం  బంగారం, వెండి ధరలు రూటు మార్చాయి. గత రెండు వారాలుగా దిగొస్తున్న బంగారం, వెండి ధరలు  స్వల్పంగా పెరిగాయి.   బుధవారం నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,550 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.55,880.  1 కేజీ వెండి రూ.66,800కు అమ్ముడవుతుండగా, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.  బుధవారం  చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,270 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 51,600. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,120 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 51,450. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,120 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,450గా ఉంది. భువనేశ్వర్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర  రూ. 56,120 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,450. గత 24 గంటల్లో రూ.100 తగ్గింది.  డాలర్‌ విలువ పెరగడంతో బుధవారం అమెరికా  బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.