Ericsson Layoff ఎరిక్​సన్​ నుంచి 8,500 మంది ఉద్యోగులు ఔట్​

Ericsson Layoff ఎరిక్​సన్​ నుంచి 8,500 మంది ఉద్యోగులు ఔట్​
Ericsson layoff 8500 employees

న్యూఢిల్లీ: టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్‌  ఖర్చుల తగ్గింపులో భాగంగా 8,500 మంది ఉద్యోగులను  తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటికే పలు దేశాల్లో ఉద్యోగులకు లేఆఫ్‌ మెమోలు జారీ చేసినట్లు వెల్లడించింది.

ఈ కంపెనీ గత సోమవారమే స్వీడన్‌లో 1,400 మంది ఉద్యోగులను తొలగించింది. రోజుల వ్యవధిలోనే మళ్లీ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు పూనుకోవడం గమనార్హం.